బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (11:14 IST)

తెల్ల బట్టలు మెరిసి పోవాలంటే.. ఆస్పిరిన్ మాత్రలను..?

Aspirin
Aspirin
వాషింగ్ మెషీన్ వాడుతున్నారా.. బట్టలు ఉతికేటప్పడు కాస్త ఆస్పిరిన్ మాత్రలను వాడితే అద్భుతమైన ఫలితం వుంటుంది. వాషింగ్ మెషిన్లలో ఉత్తమమైన లాండ్రీ డిటర్జెంట్లు వాడుతుంటారు. అయితే తెలుపు బట్టలు తెల్లగా వుండాలంటే.. ఆస్పిరిన్ మాత్రలను వాడటం మంచిది. ఇవి మందుల షాపులో దొరుకుతాయి.  
 
తెల్లని దుస్తులు.. డల్ గా కాకుండా తెల్లగా వుండాలంటే..  323 మిల్లీగ్రాముల ఐదు ఆస్పిరిన్ మాత్రలను ఓ డజను తెల్ల బట్టలను ఉతికేందుకు వాడుతున్నారు. ఆస్పిరిన్ మాత్రలను కరిగించడానికి పెద్ద గిన్నె లేదా వేడి నీటి టబ్ లో ఉంచండి. 
 
అన్ని మాత్రలు పూర్తిగా కరిగే వరకు ఉంచండి. ఈ మాత్రలు కరిగిన తర్వాత వాషింగ్ మెషీన్ కు ఉపయోగించాలి. ఈ మాత్రలు కరిగిన నీటిని వాషింగ్ మెషీన్ లో వాడితే బట్టలు మెరిసిపోతాయి.