శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 3 మే 2018 (13:06 IST)

పొడిదగ్గు తగ్గేందుకు రెండంటే రెండు చిట్కాలు

వేడిచేసి వచ్చే పొడిదగ్గు చాలా బాధిస్తుంది. శరీరంలో భాగాలన్నీ కదిలిపోవడంతో చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇది తగ్గాలంటే బాగా చలవచేసే పదార్థాలను తీసుకోవాలి. 1. ఖర్జూరపండ్లుగానీ, ఎండుఖర్జూరంగానీ తీసుకుని లోపలి గింజలను తీసేసి, దానికి సమాన బరువులో పిప్పళ్ళు, ఎ

వేడిచేసి వచ్చే పొడిదగ్గు చాలా బాధిస్తుంది. శరీరంలో భాగాలన్నీ కదిలిపోవడంతో చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇది తగ్గాలంటే బాగా చలవచేసే పదార్థాలను తీసుకోవాలి.
 
1. ఖర్జూరపండ్లుగానీ, ఎండుఖర్జూరంగానీ తీసుకుని లోపలి గింజలను తీసేసి, దానికి సమాన బరువులో పిప్పళ్ళు, ఎండుద్రాక్ష, పంచాదార, మరమరాలు వీటన్నిటనీ మెత్తగానూరి కొంచెం నేయి, తేనె కలుపుకుని రోజూ ఒక చెంచా చొప్పున రెండుపూటలా తీసుకుంటే వేడిచేయడం వలన ఊపిరాడకుండా వచ్చే దగ్గు వెంటనే తగ్గిపోతుంది. 
 
2. పెద్ద ఉసిరికాయాలను గింజలు తీసేసి బాగా దంచి, దానికి ఎనిమిది రెట్ల నీళ్ళను కలిపి, రెండురెట్లు మిగిలేదాక మరగకాయాలి. కాచిన తరువాత వడగట్టి చల్లార్చండి. ఈ కషాయానికి సమంగా పాలుపోసి మళ్ళీ కాయాలి. కషాయానికి సమానంగా నేతిని కలపాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరిగించి నెయ్యి మాత్రం మిగిలేలా కాయాలి. చల్లారిన తరువాత దీనిలో కొంచెం ఆవుపాలు, ఆపునేయి కలుపుకుని, రోజూ ఒకటి, రెండు చెంచాల చొప్పున తీసుకుంటుంటే ఎటువంటి దగ్గు అయినా త్వరగా నివారిస్తుంది.