శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (14:30 IST)

అల్పాహారం కడుపు నిండా తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదట..

అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని మానేయకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని వారు చ

అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని మానేయకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని వారు చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్‌గా అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు. 
 
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్లే మహిళల్లో ఊబకాయం సమస్య తప్పట్లేదని.. రాత్రిపూట మితంగా ఆహారం తీసుకుని.. బ్రేక్ ఫాస్ట్‌కు చాలా గ్యాప్ ఇవ్వడం ద్వారా బరువు పెరిగిపోయే ప్రమాదం వుంది. అందుచేత 8 గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచకూడదు. 
 
నిద్రలేచాక పరగడుపున వేడి నీరు.. ఆపై గ్లాసుడు టీ లేదా కాఫీ తీసుకుని గంటలోపే అల్పాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదీ అల్పాహారాన్ని నామమాత్రంగా గాకుండా.. కడుపు నిండా తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా పోషకాహారం, ప్రోటీన్లలతో కూడిన అల్పాహారంతో ఒబిసిటీ దూరమవుతుంది.