బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 మే 2020 (20:57 IST)

రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిందా? ఈ ఐదింటిని తీసుకుంటే చాలు...

రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివారు ఈ క్రింది 5 పదార్థాలను తీసుకుంటే చాలు. అవేంటో చూద్దాం.
 
ఖర్జూరం: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం లాల్సియంలు, హీమోగ్లోబిన్‌‌ను పెంచుతాయి. 
 
పుచ్చకాయ: ఈ పండులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్‌ - సి, బి ఉంటాయి. ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరములో శక్తి, ఓపిక పెరుగుతాయి.
 
బెర్రీస్: స్ట్రా బెర్రీల్లో కొన్ని రకాల్లో అత్యధికంగా ఐరన్ వుంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ విటమిన్లు వుంటాయి.
 
పండ్లు - కూరగాయలు : బీట్రూట్, ఆరెంజ్, క్యారెట్ జ్యూస్ బ్రేక్ ఫాస్ట్‌కి ముందు తాగితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసం: మాంసాహారులైతే మటన్‌ తింటే మంచిగా హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి. గుడ్లు కూడా తీసుకోవచ్చు.