బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (11:51 IST)

పెరుగుతో గుండెకు మేలెంతో..? బరువు తగ్గాలంటే?

గుండె జబ్బుల నుంచి దూరం కావాలంటే.. పెరుగు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు వున్న స్త్రీ పురుషులు ఎవరైనా రోజూ కప్పు పెరుగు తీసుకుంటే మంచిదని.. తద్వారా 30 శాతం మేర రక్తపోటును

గుండె జబ్బుల నుంచి దూరం కావాలంటే.. పెరుగు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు వున్న స్త్రీ పురుషులు ఎవరైనా రోజూ కప్పు పెరుగు తీసుకుంటే మంచిదని.. తద్వారా 30 శాతం మేర రక్తపోటును తగ్గించుకోవచ్చునని వైద్యులు చెప్పారు. పెరుగును రోజుకో కప్పు తీసుకునే స్త్రీపురుషుల్లో గుండె జబ్బులు తగ్గే అవకాశం బాగా తగ్గిందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
ఇంకా హైబీపీ సమస్యతో బాధపడేవారు ఎవరైనా నిత్యం ఆహారంలో పెరుగును భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. పెరుగుతో పాటు ఫైబర్ అధికంగా వుండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే హృద్రోగాలను నివారించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇంకా పెరుగును తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. 
 
వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే మెరిసే సౌందర్యాన్ని మీ సొంతం అవుతుంది. ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. అలాగే పెరుగు ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులోని క్యాల్షియం, తక్కువ కెలోరీలు బరువు తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.