1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 31 జులై 2021 (22:05 IST)

ఆపిల్ పండు కంటే అరటి పండులో అది నాలుగు రెట్లు అధికం

ఆపిల్‌ పండుతో పోలిస్తే అరటిలో నాలుగు రెట్లు అధికంగా ప్రొటీన్లు ఉంటాయి. రెండు రెట్లు ఎక్కువగా పిండిపదార్థాలు, మూడురెట్లు ఫాస్పరస్, అయిదురెట్లు విటమిన్-ఎ, ఐరన్, రెండు రెట్లు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
 
అరటి పండు విద్యార్థుల్లో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని పరిశోధకులు అంటున్నారు. అరటిలోని రసాయనాలు మన మెదడుపై ప్రభావం చూపించి, విశ్రాంతిని ఇస్తాయి. అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే ప్రొటీన్‌ను శరీరం సెరటోనిన్ హార్మోన్‌గా మారుస్తుంది. ఈ హార్మోన్ మనలో విశ్రాంతి భావన కలుగజేస్తుంది.
 
తీవ్రస్థాయి శారీరక శ్రమ తర్వాత అరటి పండ్లు తింటే శక్తి పుంజుకోవచ్చు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు చాక్లెట్లు, చిప్స్ వంటివి తినే అలవాటు ఉండేవారు అరటి పండ్లు తినటం చాలా మంచిది. జీర్ణాశయ గోడలకు పైపూతను ఏర్పరచటం ద్వారా ఆమ్లాల గాఢతను, ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
 
పొగ తాగడం మానెయ్యాలనుకునే వారికీ ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే బీ-6, బీ-12, పొటాషియం, మెగ్నీసియంలు శరీరంలో నికొటిన్ తగ్గినప్పుడు తలెత్తే చెడు ప్రభావాల్ని తగ్గిస్తాయి.