1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2014 (19:29 IST)

ఆరోగ్యానికి వేపపూత..ఎలా వేయాలి?

ఎండిన వేపపూతను తడిలేకుండా చూసి తేనెలో వేసి ఎండలో కొన్నాళ్ళుంచి గట్టిపడిన తర్వాత ప్రతిరోజూ ఉదయాన ఒక చెంచా చొప్పున తీసుకుంటే కఫదోషంపోయి జీర్ణశక్తిని కలిగించడమే గాకుండా ఆకలిని పుట్టిస్తుంది. 
 
వేపపూత బెల్లం కొంచెం ఉప్పు కారం కొద్దిగా నీరు కలిపినూరండి. పచ్చడిలో ఆహారంలో తీసుకుంటే కడుపులో క్రిములు పోవడమే గాక జీర్ణశక్తిని కలిగించి ఆకలిని పుట్టిస్తుంది. 
 
ఎండిన వేపపూతను దోరగా తగినంత నేతిలో వేయించి ఉప్పుకారం చల్లి అన్నములో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.