1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2016 (13:02 IST)

వేపనూనె, కర్పూరంతో దోమలు పరార్.. గుడ్‌నైట్, ఆలౌట్లు అవసరం లేదండోయ్...

దోమలతో డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చేసిందంటే.. ఇక దోమల బాధ తాళలేక గుడ్ నైట్లు, ఆలౌట్లకు నెల పొడవునా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారా? అయితే ఇక అలాంటి దోమల లిక్విడేటర్లకు గుడ్ బై

దోమలతో డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చేసిందంటే.. ఇక దోమల బాధ తాళలేక గుడ్ నైట్లు, ఆలౌట్లకు నెల పొడవునా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారా? అయితే ఇక అలాంటి దోమల లిక్విడేటర్లకు గుడ్ బై చెప్పేయండి. ఎలాగంటే.. ముందుగా పచ్చకర్పూరాన్ని లిక్విడేటర్ బాటిల్‌లో వేసి ఆపై అందులో వేపనూనెను పోయండి. తర్వాత బాటిల్‌కు మూతపెట్టి.. ప్లగ్గులో పెట్టండి. అంతే దోమల బెడద ఉండదు. 
 
అలాకాకుంటే.. కప్పు వేప నూనెలో మెత్తగా పొడి చేసిన కర్పూరం వేయాలి. ఈ మిశ్రమాన్ని దోమల రిపెల్లెంట్‌లో ఉంచి.. ప్లగ్‌లో పెట్టుకోవాలి. గదిలో దోమలూ, ఇతర పురుగులు ఉంటే వెంటనే చనిపోతాయి. 
 
అలాగే వర్షాకాలంలో ఈగలకు చెక్ పెట్టాలంటే.. తులసి కొమ్మల్ని వంటగది, డైనింగ్ టేబుల్ వద్ద ఉంచాలి. ఒకవేళ తాజా కొమ్మలు దొరక్కపోతే ఎండిపోయిన ఆకుల్ని మస్లిన్‌ వస్త్రంలో ఉంచి వేలాడదీస్తే సరిపోతుంది. అలానే లావెండర్‌, తమలపాకులూ, పుదీన వంటివి కూడా ఈగల్ని పారదోలతాయి.