శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (23:28 IST)

పాలకూరలోని మేలెంతో తెలుసా? నీరు తక్కువగా తాగేవారికి?

ఆకుకూరల్లో మేలైనది పాలకూర. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో వుండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ శరీరానికి మేలు చేస్తాయి.   బరువు తగ్గేందుకు ఇది సరైనది. మెదడు చురుగ్గా అయ్యేలా చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్‌తో పోరాడుతుంది.

టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సరిచేస్తుంది, నిద్రలేమిని పోగొడుతుంది, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకల్ని బలంగా చేస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు పాలకూర చాలా మంచిది. 
 
పాలకూరలోని పొటాషియం... కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను కూడా బాగుచేస్తుంది. ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. పాలకూరలోని విటమిన్ కె జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది.

శరీరంలోని వ్యర్థాలను వెలివేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి పాలకూర మేలు చేస్తుంది. నీరు తక్కువగా తాగేవారికి పాలకూర ప్రయోజనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.