శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 30 మే 2019 (20:23 IST)

కోరికలను పెంచే రొయ్యలు....

మనకు అందుబాటులో ఉండే సీ ఫుడ్స్‌లో రొయ్యలు ఒకటి. వీటిని ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సీ ఫుడ్ అయిన రొయ్యలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని వారు అంటున్నారు. కాల్షియం లేమి సమస్యతో బాధపడేవారు రొయ్యలను తీసుకోవడంతో సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. 
 
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన రొయ్యలతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. విటమిన్ ఇ కలిగిన రొయ్యలతో చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. రొయ్యలను తినడం వల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా రొయ్యలు మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. రొయ్యలను వారంలో రెండు లేదా మూడు రోజుల పాటు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నట్టయితే ఈ కోర్కెలు బాగా పెరుగుతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.