శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (13:06 IST)

వీకెండ్‌లో హోటళ్లకు వెళ్లి.. ఫుల్‌గా లాగిస్తున్నారా?

వారమంతా ఇంటి భోజనం తిని బోర్ కొట్టేసిందా? వీకెండ్ ఏదైనా హోటల్‌కు వెళ్ళి ఫుల్‌గా లాగించే వారు మీరైతే.. ఇక జాగ్రత్తపడాల్సిందే. వీక్ డేస్‌లో ఇంటి భోజనాన్ని టిఫిన్ బాక్సుల్లో తీసుకెళ్లి పొట్టనింపుకుని...

వారమంతా ఇంటి భోజనం తిని బోర్ కొట్టేసిందా? వీకెండ్ ఏదైనా హోటల్‌కు వెళ్ళి ఫుల్‌గా లాగించే వారు మీరైతే.. ఇక జాగ్రత్తపడాల్సిందే. వీక్ డేస్‌లో ఇంటి భోజనాన్ని టిఫిన్ బాక్సుల్లో తీసుకెళ్లి పొట్టనింపుకుని... వీకెండ్ వచ్చాక.. జంక్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్ తీసుకునే వారికి అనారోగ్యం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ తీసుకునే జంక్ ఫుడ్ కన్నా వారాంతంలో మితిమీరి తీసుకునే చిప్స్, బర్గర్, పిజ్జా, చికెన్ ఫుడ్స్‌తో అనారోగ్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
జంక్ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడం ద్వారా ఊబకాయం వస్తుందని, ఇందులోని మితిమీరిన ఫ్యాట్, కార్బొహైడ్రేడ్లు, కెలోరీలు బరువును పెంచేస్తాయి. ఒబిసిటీ హృద్రోగాలకు, మధుమేహానికి దారి తీస్తుంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అందులోని పిండి పదార్థాలు, ఇన్సులిన్ లెవల్స్‌ను పెంచేస్తాయి. తద్వారా టైప్-2 డయాబెటిస్‌, ఒత్తిడి తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి.