శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:34 IST)

వేసవి ఎండల్లో బయటికి వెళ్లాల్సి వస్తే..?

వేసవిలో ఎండల్లో వెళ్లే పనులను చాలామటుకు పక్కనబెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఇంటి నుంచి కాలు బయటపెట్టకపోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. వేస

వేసవిలో ఎండల్లో వెళ్లే పనులను చాలామటుకు పక్కనబెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఇంటి నుంచి కాలు బయటపెట్టకపోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. వేసవి ఎండలో బయటికి వెళ్లడం ద్వారా పలు చర్మ.. ఇతర అనారోగ్య సమస్యలు తప్పవ్. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే.. ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. 
 
ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల వరకు, బయటకు వెళితే మరో లీటరు వరకు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా పండ్ల రసాలను తీసుకోవచ్చు. ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోకండి. గొడుగు, సన్ స్ర్కీన్ లోషన్స్, క్యాప్.. వదులైన దుస్తులు ధరించాలి. లేత రంగు దుస్తులనే ధరించాలి. 
 
కాఫీ, టీలే కాకుండా ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఆరు బయట, ఎండలో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉంటే మంచిది. రోజులో అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.