మంగళవారం, 21 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 15 ఫిబ్రవరి 2024 (22:30 IST)

పొట్ట వద్ద కొవ్వు పెరిగి లావుగా కనబడుతుందా? ఇలా చేస్తే కరిగిపోతుంది

Belly Fat
పొట్ట వద్ద పేరుకుపోయే కొవ్వు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ప్రొటీన్ ఆహారం తినడం, వ్యాయామం చేయడం వంటివి పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి తీసుకోవలసిన కొన్ని చర్యలు మాత్రమే. ఈ క్రింది చిట్కాలతో పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు.
 
పొట్ట కొవ్వును తగ్గించడానికి, మీ డిన్నర్‌లో ఈ కూరగాయలను చేర్చుకోండి
రాత్రి భోజనంలో దోసకాయ తదితర కాయగూరలు తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
పోషకాలు వుండే సొరకాయ రాత్రి భోజనంలో తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది.
రాత్రి భోజనంలో ఆకుకూరలు తింటే బరువు తగ్గుతారు.
రాత్రి భోజనంలో పాలకూర వెజిటబుల్ రైస్ లేదా బచ్చలికూర సూప్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
డిన్నర్‌లో బ్రకోలీని సలాడ్‌తో తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది.
క్యారెట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.