శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 16 సెప్టెంబరు 2017 (17:03 IST)

ఏ పదార్థాల్లో ఏ విటిమిన్లు ఉంటాయంటే...?

చాలామంది ఎక్కువగా ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఫలితంగా కొన్ని పదార్థాలను అసలు తీసుకోకుండా ఉండిపోవడం జరుగుతుంది. దీనితో శరీరానికి కావలసిన విటమిన్లన్నీ పుష్కలంగా అందవు. అలాంటప్పుడు ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది. అప్పుడు వైద్యుడు తాత్కాలిక

చాలామంది ఎక్కువగా ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఫలితంగా కొన్ని పదార్థాలను అసలు తీసుకోకుండా ఉండిపోవడం జరుగుతుంది. దీనితో శరీరానికి కావలసిన విటమిన్లన్నీ పుష్కలంగా అందవు. అలాంటప్పుడు ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది. అప్పుడు వైద్యుడు తాత్కాలికంగా కొన్ని మాత్రలను రాసినప్పటికీ పూర్తిస్థాయిలో సమస్య పరిష్కరించాలంటే... పలు ఆహార పదార్థాలను తీసుకోక తప్పదు. ఏ పదార్థాల్లో ఏ విటమిన్ ఉంటుందో తెలుసుకోవడం తప్పనిసరి. అవేమిటో చూద్దాం.
 
బి1 - ఈస్ట్, తృణధాన్యాలు
బి2- గోధుమలు, కోడిగుడ్డులు, పాలు, ఈస్ట్
బి6- ఈస్ట్, మాంసం, రోటీలు, బఠాణీలు.  
బి12 - ఈస్ట్, పాలు, కోడిగుడ్డు
విటమిన్ సి- పులుపు నిచ్చే పండ్లు, నిమ్మ, ఆరెంజ్ వంటివి. 
విటమిన్ డి - సూర్య కాంతి, వెన్న
విటమిన్ ఈ - గోధుమలు, ఆకుకూరలు, పాలు 
విటమిన్ కె- క్యాబేజీ, పచ్చి బఠాణీలు, కూరగాయలు
 
ఉసిరికాయలో ఎక్కువగా ఉండే విటమిన్ సి.. కేరట్, చేపలు, నూనెల్లో ఉంటాయి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటాయి.