శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (11:27 IST)

బీపీ, ఒత్తిడిని నివారించే వాల్‌నట్స్

వాల్‌నట్స్‌ (అక్రోటు కాయ)లు ఒత్తిడి, లో బీపీలను నివారించేందుకు ఉపయోగపడతాయని తాజా అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే బాదంపప్పు ఒత్తిడి, రక్తపోటులను కూడా నియంత్రిస్తుందని అమెరికా విశ్వవిద్యాలయం

వాల్‌నట్స్‌ (అక్రోటు కాయ)లు ఒత్తిడి, లో బీపీలను నివారించేందుకు ఉపయోగపడతాయని తాజా అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే బాదంపప్పు ఒత్తిడి, రక్తపోటులను కూడా నియంత్రిస్తుందని అమెరికా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 
 
దీనిపై మూడు వారాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో వాల్‌నట్స్ తీసుకోవడం ద్వారా లో బీపీ, ఒత్తిడిని కొంతమేరకు నివారించవచ్చని తేలింది. అంతేగాకుండా హృద్రోగ వ్యాధులు కూడా నయమవుతాయని ప్రొఫెసర్ షీలా తెలిపారు. అలాగే ఊబకాయం వంటి సమస్యలకు కూడా వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని అధ్యయనంలో తేలింది. 
 
ఈ పరిశోధనలను మూడు రకాలుగా చేశారు. ఒకటి వాల్‌నట్స్ లేకుండా, మరొకటి వాల్‌నట్స్‌తో, ఇంకొకటి వాల్‌నట్స్, ఫ్లెక్సీడ్ ఆయిల్‌‍తో చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. లో బీపీతో బాధపడుతూ వాల్‌నట్స్‌ను ఉపయోగించిన వారిలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కూడా ఉన్నట్టు వారు పేర్కొన్నారు.