లవంగాలు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?
లవంగం. వంటింటి మసాలా దినుసుల్లో ప్రముఖమైనది ఇది. లవంగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుంది. అది ఎలాంటి హాని అనేది తెలుసుకుందాము.
లవంగాలను అతిగా తింటే పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుదల చోటుచేసుకుంటుంది.
రక్తస్రావం వంటి సమస్యలున్నవారు లవంగాలను అతిగా తీసుకోరాదు.
లవంగాలను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తినకపోవడం మంచిది.
లవంగాలలో వున్న గుణాలు కారణంగా వీటిని ఎక్కువగా తింటే దృష్టి దోషాలు వచ్చే అవకాశం వుంది.
లవంగాలను ఎక్కువగా తింటే శరీరంలో ఉష్ణం అధికమవుతుంది, ఫలితంగా కిడ్నీ, కాలేయంపై ప్రభావం చూపుతుంది.
శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా వున్నవారు లవంగాలను తినకూడదు.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.