గోరింటాకు ఎర్రగా పండాలంటే... అరికాళ్లల్లో పెట్టుకుంటే..?
గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రసాయనాలతో చేసిన కోన్ జోలికి పోవద్దు. ఆకుని తెంపుకుని మెత్తగా నూరుకుని.. అందులో చక్కెర, రెండు లవంగాలు వేయండి. గిన్నెలోకి తీసుకున్నాక ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కల యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్‌ని కలిపి పక్కన పెట్టండి. ఓ అరగంట గడిచాక గోరింటాకుని చేతులకు పెట్టుకోవాలి.
కనీసం నాలుగైదు గంటలైనా ఉంచుకోగలిగితే చక్కటి రంగు వస్తుంది. గోరింటాకు ఎండిపోతే చక్కెర నిమ్మరసం కలిపిన సిరప్‌లో ముంచిన దూదితో అద్దండి. గోరింటాకు తేసేశాక లవంగ నూనెను చేతికి రాసుకుంటే చక్కటి రంగులోకి వస్తుంది.
గోరింటాకుకి వేడిని తగ్గించే గుణం ఉంది. అందుకే అధిక వేడితో ఇబ్బందిపడేవారు అరికాళ్లల్లో దీన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. మానసిక ఒత్తిడి దరిచేరనివ్వదట గోరింటాకు, నువ్వుల నూనెలో, గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే జుట్టు ఎదుగుతుంది. తెల్ల వెంట్రుకలు త్వరగా రావని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.