వేసవి వస్తోంది.. పెండింగ్ పనులు పూర్తి చేయండి.. ఈవో
వేసవి సమీపిస్తుండడంతో భక్తుల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఏర్పాట్లును పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబ శివరావు టిటిడి అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు నెల రోజుల లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు.
కార్యనిర్వహణాధికారి తిరుపతిలోని తన చాంబర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పిఏసి 1,2,3 ఉన్న పనులపై ఒక నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తిరుమల జేఈవో, సిఈ, ఎఫ్ఏ సిఏఓ సభ్యులుగా ఉంటారు. పెండింగ్ లో అన్ని పనులను వచ్చే నెల మొదటి వారం లోపు పూర్తి చేసే చర్యలు తసుకోవాలని నిర్ణయించారు. కళ్యాణమండపంలోని మరమ్మత్తు పనులు, స్విమ్స్, బర్డులోని పనులు పూర్తి చేయాలని కోరారు.
తిరుమలలో సిసి కెమెరా ఏర్పాటు, ఘాట్ రోడ్లలో పరిశుభ్రత వంటి వాటిని పరిశీలించాలని ఆరోగ్య శాఖ, ఐటి విభాగాలను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.