శనివారం, 31 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 7 మార్చి 2015 (09:25 IST)

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.  తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ56,373 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 26 నిండాయి. వారికి 20 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 6 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. 
 
వారు స్వామివారిని దర్శించుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి రద్దీ కాస్త పెరిగే అవకాశం ఉంది. వారాంతం కావడంతో చెన్నయ్, బెంగళూరు నుంచి వచ్చే భక్తుల సంఖ్య పెరుగింది. శనివారం కావడంతో ఇటు భక్తులు, అటు ఉద్యోగులతో తిరుమల కిటకిటలాడే అవకాశం ఉంది.