ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 నవంబరు 2021 (23:48 IST)

తేనె, అల్లంతో కూడిన ఇంగువను తీసుకుంటే?

అరకప్పు నీటిలో చిన్నచిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కల్గుతుంది. స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు నొప్పి, తిమ్మిరి,  వంటి వాటికి ఇంగువ చక్కగా పని చేస్తుంది.

 
ఇంగువ శ్వాస సంబంధ అంటువ్యాధులను తగ్గించడానికి, శ్వాస ఉత్తేజపరిచే ఒక మందుగా, కఫము తగ్గించటానికి, ఛాతీ పైన ఒత్తిడి తగ్గించటానికి బాగా పనిచేస్తుంది. తేనే, అల్లంతో కూడిన ఇంగువను దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటిశ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం కోసం వాడటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

 
ఇంగువను డయాబెటిస్ వైద్యంలో వాడతారు, ఇది క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కాకర కాయను ఇంగువతో కలిపి వండటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

 
ఈ ఔషధ మూలిక వైద్యప్రభావంతో పాటుగా అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా రక్షిస్తుంది. తక్కువ రక్తపోటుకు సహాయపడుతుంది.