గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (21:50 IST)

బొబ్బర్లతో స్వీట్ పొంగలి ఎలా చేయాలో తెలుసా?

బొబ్బర్లు రుచికరంగా మరియు మంచి ప్లేవర్‌ను కలిగి ఉంటాయి. ఇందులో వివిధ రకాల న్యూట్రిషియన్స్ కలిగి ఉండి మన శరీరంలోని వివిధ రకాల జీవక్రియలకు సహాయపడతాయి. ఇందులో ఉండే ప్లెవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం మరుయు మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి అద్బుతంగా సహాయపడతాయి. మరి ఇన్ని ఉపయోగాలున్న బొబ్బర్లను స్వీట్ పొంగలిలాగా కూడా చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
 
కావలసిన పదార్దాలు:
బొబ్బర్లు- ఒకకప్పు,
బియ్యం- ఒక కప్పు, 
బెల్లం తురుము- ఒక కప్పు
యాలుకల పొడి- ఒక స్పూన్,
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్స్
జీడిపప్పు, కిస్‌మిస్- కొద్దిగా,
ఉప్పు- చిటికెడు.
 
తయారీ విధానం:
బియ్యం బొబ్బర్ల పప్పు కడిగి విడివిడిగా అరగంట నానబెట్టాలి. స్టవ్ వెలిగించి నెయ్యి వేడిచేసి జీడిపప్పు కిస్‌మిస్ వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన బొబ్బర్ల పప్పు, బియ్యం వేసి, నాలుగు కప్పుల నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టాలి. దీనిని రెండు విజిల్సు వచ్చేవరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత కుక్కర్ మూత తీసి బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలు సన్నని సెగపై ఉడికిస్తే బొబ్బర్ల పొంగలి రెడీ అవుతుంది. దీనిలో చిటికెడు ఉప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి కలపాలి. ఎంతో రుచిగా ఉండే బొబ్బర్ల పొంగలి రెడీ.