శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:19 IST)

కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టే.. పన్నీర్‌ దోసె ఎలా చేయాలంటే?

పన్నీర్‌లో క్యాల్షియం పుష్కలంగా వుంది. ఇది దంతాలు, ఎముకలకు శక్తినిస్తుంది. పనీర్‌లోని విటమిన్ డితో శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా మహిళలకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌లోని ప్రోటీన్, క్యాల్ష

పన్నీర్‌లో క్యాల్షియం పుష్కలంగా వుంది. ఇది దంతాలు, ఎముకలకు శక్తినిస్తుంది. పనీర్‌లోని విటమిన్ డితో శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా మహిళలకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌లోని ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్స్ ఎముకలను ధృఢంగా ఉంచి కీళ్ల నొప్పులకు చెక్ పెడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. ఈ పనీర్‌తో దోసె ఎలా చేయాలో ట్రై చేసి చూద్దాం. 
 
దోసెపిండి - నాలుగు కప్పులు 
పనీర్ తురుము - రెండు కప్పులు 
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు, నూనె - తగినంత
కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం : 
దోసెపిండిలో పన్నీర్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు చేర్చి పిండిని జారుగా సిద్ధం చేసుకోవాలి. ఈ దోసెపిండితో పెనం వేడయ్యాక దోసెల్లా పోసి ఇరువైపులా దోరగా కాగా హాట్ హాట్‌గా కొబ్బరి, టమోటా, నాన్‌వెజ్ గ్రేవీలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.