1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (15:54 IST)

ఇంటిరీయర్ టిప్స్: రోజూ శుభ్రం చేయాల్సిన వస్తువులేంటి?

ఉద్యోగం చేసే మహిళలు ముఖ్యంగా ఇంటి శుభ్రత పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సెలవు రోజుల్లోనే కాకుండా సమయపాలనతో ఇంట్లోని కొన్ని వస్తువులను రోజూ శుభ్రం చేస్తేనే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు అంటున్నారు. 
 
ప్రతిరోజూ వంటగదిలోని వస్తువులను అప్పటికప్పుడు శుభ్రంగా వాష్ చేయాలి. సింక్, గిన్నెలను అప్పటికప్పుడు వాష్ బార్స్‌తో క్లీన్ చేసుకోవాలి. స్టౌవ్ ఉంచిన ఫ్లోర్‌తో పాటు స్టౌవ్‌పై మరకలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే..  శుభ్రతకంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వుండదు. 
 
అలాగే వారానికి ఒకసారి కాకుండా సోఫా సెట్, బెడ్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్లోర్, టవల్స్, కూరగాయలు తరిగే నైఫ్స్ చోపింగ్ బోర్డ్స్, డైనింగ్ టేబుల్‌ను రోజుకోసారి తప్పకుండా క్లీన్ చేయడం మంచిది.