బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:36 IST)

దారుణం, శ్రీలంక పౌరుడిపై పాకిస్తాన్‌లో మూకదాడి, చంపి పెట్రోల్ పోసి...

ఇస్లామాబాద్: దైవదూషణ ఆరోపణలపై శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తిపై శుక్రవారం సియాల్‌కోట్‌లో మూక దాడి చేసింది. ఆ దాడిలో అతడిని చంపిన తర్వాత అతని మృతదేహాన్ని దగ్ధం చేసారు.
 
 
పాకిస్తాన్ పత్రిక ది డాన్ కథనం ప్రకారం, సియాల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఫ్యాక్టరీల కార్మికులు ఫ్యాక్టరీ ఎగుమతి మేనేజర్‌పై దాడి చేసి అతని మృతదేహాన్ని దహనం చేశారు.
 
 
సియాల్‌కోట్ జిల్లా పోలీసు అధికారి ఉమర్ సయీద్ మాలిక్ మాట్లాడుతూ ఆ వ్యక్తిని శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమారగా గుర్తించారు.