గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (18:50 IST)

రేషన్ కార్డు కలిగిన వారికి కొత్త యాప్‌: ఈ యాప్ ద్వారా...

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ప్రత్యేక సేవలు అందిస్తోంది. రేషన్ కార్డు కలిగిన వారికి కొత్త యాప్‌ని ఒకటి తీసుకు రావడం జరిగింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి పలు రకాల బెనిఫిట్స్ కలుగనున్నాయి. ఆ యాప్ ఏమిటంటే మేరా రేషన్. అసలు ఈ యాప్ ఎందుకు, ఎలాంటి లాభాలని రేషన్ కార్డు కలిగినవాళ్లు పొందొచ్చు అనేది చూస్తే.. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది చాలా అనువుగా ఉంటుంది.
 
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ కింద ప్రయోజనం పొందే వారికి ఇది హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది. దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారు రేషన్ షాపు దగ్గరిలో ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకోవచ్చు. ఇంకా ఇటీవల తీసుకున్న సరుకులు వివరాలు కూడా మీరు చూడొచ్చు. 
 
అదే విధంగా లావాదేవీల సమాచారం కూడా ఈ యాప్‌లో ఉంటుంది. అలాగే హిందీ, ఇంగ్లీష్‌లోనే ఈ యాప్ అందుబాటులో వుంది. అయితే రానున్న కాలంలో తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.