మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:54 IST)

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఒక్కరోజే 108 కేసులు

చైనాలో రోజురోజుకు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. వుహాన్ నగరంలో పుట్టి.. ప్రపంచ దేశాలను అట్టుడికింపజేస్తున్న కరోనా వైరస్.. మళ్లీ చైనాలో విజృంభించడం కలకలం రేపుతోంది. 
 
తద్వారా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుండడంతో అటు ప్రపంచ దేశాలతో పాటు చైనా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే చైనాలో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరోసారి భయాందోళనకు గురిచేస్తుంది. దీనితో చైనా ప్రభుత్వం మళ్ళీ చర్యలకు సిద్ధమైంది. 
 
వుహాన్ నగరంలో జంతు మాంసం తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెంది నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.... ప్రస్తుతం అటవీ జంతువుల మాంసంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
అయితే చైనాలో నమోదవుతున్న కొత్త కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే బయట పడుతున్నాయని అధికారులు తేల్చారు. చైనాలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 3347 పెరిగింది.