ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?
డ్రాగన్ కంట్రీ చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారి ఎగిరే ట్యాక్సీలు (ఫ్లైయింగ్ ట్యాక్సీలు)లకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు చైనా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. ఈహ్యాంగ్, హెఫీ హే ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ జారీచేసింది. ఈ మేరకు చైనా మీడియా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది.
చైనా ఫ్లైయింగ్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడం ప్రపంచ సాంకేతిక రంంలో పెను మార్పులకు నాందిపలుకనుంది. డ్రోన్ ఆధారిత ఫ్లైయింగ్ ట్యాక్సీల వాణిజ్య కార్యకలాపాలకు చైనా ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో సాంకేతిక ఆధిపత్య పోరులో ఆ దేశం మరో ముందడుగు వేసినట్టయింది.
క్యాంటమ్, కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6జీ నెట్‌వర్క్‌లతో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, బ్లింప్స్, ఫ్లైయింగ్ కార్లను చైనా ప్రోత్సహిస్తున్న విషయం తెల్సిందే. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.
అయితే, ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల భద్రత, నియంత్రణ, మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సవాళ్లను చైనా ఎలా అధికమిస్తుందన్నది ఇపుడు ఓ సవాల్‌గా మారింది.