1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (07:40 IST)

ఆ యుద్ధం భారత్ కు లాభమేనా?

రష్యా, సౌదీ అరేబియా దేశాల మధ్య చమురు ఉత్పత్తుల విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల చమురు ధరలను తగ్గించింది సౌదీ. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనవైపు ప్రయాణిస్తున్నాయి.

చమురు ధరలు తగ్గటం భారత్కు కలిసొచ్చే అంశమైనా.. వినియోగించుకునే సామర్థ్యం దేశానికి ఉందా అనేది ప్రశ్నగా మిగిలింది. భారత్‌ చేతి చమురు వదులుతోంది.

చమురు రేట్లు పెరిగిన ప్రతిసారీ ఈ మాటలు మనకు వినపడుతుంటాయి. కానీ, చమురు ఉత్పత్తిదారుల మధ్య నెలకొన్న పోటీలో భారత్‌ లబ్ధిదారుగా నిలిచే అవకాశం లభించింది.

వాణిజ్యలోటును తగ్గించుకొనే సువర్ణావకాశం దక్కింది. చమురు ధర పెరిగితే భారత్‌ నష్టపోతుంది.. ధర తగ్గితే లాభపడుతుంది.. అసలే మందగమనంలో ఉన్న సమయంలో దేశంలో వాణిజ్యలోటు పెరగకుండా జాగ్రత్త పడాలి.

ఈ నేపథ్యంలో భారత్‌కు అనుకోని వరంలా అంతర్జాతీయ పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఒపెక్‌+రష్యా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా బ్రెంట్‌ చమురు ధర బ్యారెల్‌కు 33 డాలర్లకు తగ్గడం కలిసొచ్చే అంశంగా మారింది.