ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేపాల్ విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు...

nepal plane crash
నేపాల్ దేశంలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. మొత్తం 68 మంది చనిపోయగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ నలుగురు కూడా చనిపోయినట్టు ఆదివారం నిర్ధారణ అయింది. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 72కు చేరింది. అయితే, రెస్క్యూ సిబ్బందికి దొరికిన ఫోన్‌లో వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు ఓ భారతీయ ప్రయాణికుడు తన మొబైల్ ఫోనులో గగనతలంతో పాటు విమానం లోపలి భాగాన్ని వీడియో తీశాడు. ఇపుడు ఈ విడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
విమానం కూలిన ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తుంది. ఈ సిబ్బందికి ఒక మొబైల్ ఫోన్ లంభించింది. ఇందులో విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన విమానం నేలవైపు దూసుకురావడాన్ని నేపాలీ పౌరుడు ఒకరు వీడియో తీశాడు. ఓ భవనంపై నుంచి తీసిన ఈ వీడియోలో యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.