గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (11:40 IST)

అమెరికాలో కాల్పులు : నలుగురు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఓ నౌకాశ్ర‌యంలో సౌదీ ఎయిర్‌ఫోర్స్ ట్రైనర్ కాల్పులకు పాల్ప‌డడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

వెంటనే ప్రతిస్పందించిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని హ‌త‌మార్చారు. నేవ‌ల్ ఎయిర్‌స్టేష‌న్ పెన్స‌కోలాలో ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ కాల్పుల్లో మరో  ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారని అధికారులు చెప్పారు.

దీనిపై స్పందించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ ఘటనను వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.