జైలులో మహిళా గార్డులపై అత్యాచారం.. బానిసగా మార్చేశారు..
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా జైలులోని మహిళా గార్డులకే భద్రత కరువైంది. మహిళా జైలు గార్డులపై లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఘటన జెరూసలేంలో చోటుచేసుకుంది. జెరూసలేంలోని గిల్బోవా జైలులో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక పాలస్తీనా ఖైదీ తనపై బలవంతంగా అత్యాచారం చేసేవాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, జైలులో కొన్ని వార్డులలో ఖైదీలు, పురుష అధికారులకు దాడులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో అక్కడ మహిళ గార్డులను నియమించారు. ఆ తర్వాత కొందరు ఖైదీలు మహిళ గార్డును బెదిరిస్తూ లైంగిక చర్య కోసం బానిసగా మార్చేశారని ఆమె తన బాధను చెప్పుకుంది. జైలు నుంచి బయటకు రాకుండా తమను అధికారులు చేశారని తెలిపింది.
అయితే.. కొందరు జైలులోని సొరంగం మార్గం గుండా తప్పించుకున్నారు. దీనిపై మహిళ గార్డు.. తమను బలవంతంగా లైంగిక చర్య కోసం బానిస చేశారని ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా బలవంతంగా తమను అనుభవించేవారని తెలిపింది. ఈ పరిణామాలు.. కాస్త ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి వరకు వెళ్లింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.