శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (11:39 IST)

హిజాబ్ అనేది మహిళల అణిచివేతకు - అవమానానికి చిహ్నం : తస్లీమా నస్రీన్

taslima nasreen
హిజాబ్‌పై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ అనేది మహిళల అణిచివేతకు, అవమానానికి చిహ్నం అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా తమ హిజాబ్‌ను కాల్చివేసి హిజాబ్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలిపాలి అని ఆమె పిలుపునిచ్చారు. 
 
కాగా, హిజాబ్‌ను వ్యతిరేకించిన ఇరాన్ మహిళలను తమ జుట్టు కత్తిరించి తమ నిరసన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. వీరిని అభినందించిన తస్లీమా నస్రీన్... ఇరాన్ మహిళలకు తన మద్దతు ప్రకటించింది. పైగా, వారి ధైర్యాన్ని మెచ్చుకుంది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, హిజాబ్ అనేది మహిళల అణిచివేతకు, అవమానానికి చిహ్నం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా తమ హిజాబ్‌ కాల్చివేసి హిజాబ్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలిపాలి అని పిలుపునిచ్చారు. 
 
హిజాబ్ ధరించాలనుకునే మహిళలకు అలా చేసే హక్కు ఉండాలి. కానీ, ఇష్టపడని వ్యక్తులు హిజాబ్ ధరించకుండా ఉండే హక్కు ఉండాలని చెప్పారు. హిజాబ్ అనేది నిజానికి ఎంపిక కాదు. చాలా మంది మహిళలు హిజాబ్ ధరిస్తారు. ఎందుకంటే వారు హిజాబ్ ధరించవలసి ఉంటుంది. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బలవంతంగా మహిళలు హిజాబ్ ధరించేలా బ్రెయిన్ వాష్ చేస్తారు" అని అన్నారు. 
 
మత ఛాందసవాసులు స్త్రీలను బురాఖా, హిజాబ్ ధరించమని బలవంతం చేస్తారని, హిజాబ్ మతపరమైనది కాదని, ఇది రాజకీయ హిజాబ్ అంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.