సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (13:18 IST)

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కొత్త కోణం : తోలు ఒలిచి.. శరీరాన్ని ముక్కలు చేసి...

Anwarul Azim Anar
ఇటీవల వైద్యం కోసం కోల్‌కతా నగరానికి వచ్చి అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనార్‌ శవమై తేలాడు. ఈయన హత్య కేసులో గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు బంగ్లాదేశ్ వలస కార్మికుడు జిహాద్ హవ్లాదార్‍‌ను ముంబైలో అరెస్టు చేశారు. ఈ నిందితుడి వద్ద జరిపిన విచారణలో.. ఎంపీని ఏ విధంగా హత్య చేశాడన్న విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తరుజ్జామన్ ఆదేశాలతో తనతో పాటు మరో నలుగురు బంగ్లా జాతీయులు ఈ హత్య కేసులో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. 
 
కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌లో ఎంపీని తొలుత గొంతు నులిమి చంపామని పేర్కొన్నారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా చర్మ ఒలిచి ఆ తర్వాత శరీర భాగాలు, ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా చేసినట్టు అంగీకరించాడు. ఆ తర్వాత శరీర ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్‌కతా నలువైపుల పడేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఎంపీ శరీర భాగాల కోసం బెంగాల్ సీఐడీ పోలీసులు గాలిస్తున్నారు. కాగా, వైద్య చికిత్స కోసమే మే 12వ తేదీన ఎంపీ అన్వరుల్ అంజీ అనార్ కోల్‌కతా నగరానికి వచ్చారు. కాగా, ఈ కోసులో హనీ ట్రాప్ (వలపు వల) కోణం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం మహిళ ద్వారా హనీ ట్రాప్ చేయించి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.