బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (14:08 IST)

ఉక్రెయిన్‌లో నో ఫ్లై జోన్... నాటో సభ్య దేశాల తిరస్కరణ

రష్యా వైమానిక దాడులు చేయడాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. అయితే నో ఫ్లైజోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది. అలా చేస్తే.. ఐరోపాలో పెను యుద్ధానికి దారితీస్తుందన్న నాటో హెచ్చరిస్తోంది. 
 
ఉక్రెయిన్ గగనతలంలో నో ఫ్లై జోన్ ఏర్పాటుకు తిరస్కరించినందుకు ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటో నిర్ణయంతో ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా మరింత బాంబు దాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.