శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (12:59 IST)

ఘజనీ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించిన పాకిస్థాన్

పాకిస్థాన్ మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇప్పటికే భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ పరిస్థితుల్లో ఘ‌జ‌నీ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను తాజాగా పరీక్షించింది. ఈ విష‌యాన్ని ఐఎస్‌పీఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ తెలిపారు. 
 
ఘ‌జ‌నీ క్షిప‌ణి 290 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ప‌లుర‌కాల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్ల‌గ‌ల‌దు. ఘ‌జనీ మిస్సైల్ ప‌రీక్ష విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో పాక్ ప్ర‌ధాని, అధ్య‌క్షుడు అభినందలు తెలిపారు. ఉప‌రిత‌లం నుంచి ఉప‌రిత‌లం వ‌ర‌కు ప్ర‌యోగించే ష‌హీన్‌2 మిస్సైల్‌ను కూడా ఇటీవ‌ల పాక్ ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే.