సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (15:56 IST)

కన్నబిడ్డను మరిచిపోయి ఫ్లైటెక్కేసింది.. ఆకాశంలో కేకలు... ఏమైంది?

మొన్నటికి మొన్న ఓ మహిళ హోటల్‌లో తింటూ తింటూ తన కన్నబిడ్డను మరిచి కారెక్కేందుకు బయటికి వచ్చేసింది. అయితే మళ్లీ గుర్తు చేసుకుని హోటళ్లోకి వెళ్లి పిల్లాడిని వెంట తెచ్చుకుని కారులో తుర్రుమంది. ఇత విమానాశ్రయాల్లో ఏదైనా బ్యాగు మరిచిపోతారు.


అయితే ఇక్కడ విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్ట్ వచ్చిన ఓ మహిళ తన శిశువు మరిచిపోయి ప్లైట్ ఎక్కేసింది. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన సంభవించింది. 
 
మార్గమధ్యంలో ఏదో మర్చిపోయినట్టు అనిపించిన ఆమె అసలు విషయం గుర్తొచ్చి షాక్‌కు గురైంది. వెయింటిగ్ హాల్‌లో తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కిన విషయం గుర్తు రావడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. విషయం విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు. 
 
పైలట్  చెప్పిన విషయాన్ని విన్న ఏటీసీ ఆశ్చర్యపోయింది, ఆపై అనంతరం విమానం వెనక్కి వచ్చేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చింది. విమానం ల్యాండ్ అయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఇక ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.