ఆఫ్ఘన్‌లో మరిన్ని ఉగ్రదాడులు.. హెచ్చరించిన అమెరికా
ఆప్ఘనిస్థాన్ దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అగ్రరాజ్య అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే ఆప్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్ద ఐఎస్ తీవ్రవాదులు విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఈ బాంబు దాడిలో అనేక మంది మృత్యువాతపడ్డారు.
ఈ నేపథ్యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంన్జీ పేర్కొన్నారు. ఈసారి ఉగ్రవాదులు రాకెట్లు, వాహనబాంబులతో ఎయిర్‌పోర్ట్ లక్ష్యంగా దాడులు చేయవచ్చని హెచ్చరించారు. ఎయిర్ పోర్ట్ బయట ఉన్న వ్యక్తులతో పాటుగా ఎయిర్‌పోర్ట్ లోపల ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.