సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:21 IST)

అమెరికా ఓక్లహోమాలో టోర్నడోలు.. నలుగురు మృతి

Tornodo
అమెరికాలోని ఓక్లహోమాను అనేక పెద్ద టోర్నడోలు తాకాయి. శనివారం రాత్రి నుండి కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ తెలిపారు. తాను గవర్నర్‌గా వున్నప్పటి నుంచి తాను చూసిన అత్యంత నష్టం ఇదేనని స్టిట్ వెల్లడించారు. 
 
దక్షిణ ఓక్లహోమాలోని ముర్రే కౌంటీలో సల్ఫర్ పట్టణంలో, కనీసం రెండు పెద్ద టోర్నాడోల నేపథ్యంలో ఒక వ్యక్తి మరణించాడు. దాదాపు 30 మంది గాయపడ్డారు. ఇది అనేక గృహాలు, భవనాలను చదును చేసింది. ఇకపోతే.. ఈ నగరానికి వరద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది.  
 
ఇకపోతే.. ఈ టోర్నడోల ధాటికి హోల్డెన్‌విల్లే నగరంలో ఒక శిశువుతో సహా మరో ఇద్దరు మరణించారు. అక్కడ కనీసం 14 గృహాలు  ధ్వంసమయ్యాయి.