పేరు మార్చుకోనున్న మంకీ పాక్స్.. ఎందుకో తెలుసా?
మంకీ పాక్స్ వైరస్ పేరు మారనుంది. ఆఫ్రికాలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తర్వాత మంకీ పాక్స్ పేరుపై భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి.
నిజానికి మొదట్లో కోతుల నుంచి మనుషులకు వ్యాపించడం వల్ల మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తికి, కోతులకు నేరుగా ఎటువంటి సంబంధం లేదు.
అంతేగాకుండా మంకీ పాక్స్ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో బ్రెజిల్ వంటి పలు దేశాల్లో ప్రజలు అవగాహన లేక కోతులను కొట్టి చంపడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
అందువల్ల ఇప్పటికీ మంకీ పాక్స్ పేరుతో పిలవడం సరికాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఆరోగ్య శాఖ కూడా ఈ పేరు మార్చాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ పేరు మార్చాలని భావిస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఎవరైనా సరే https://icd.who.int/dev11 ద్వారా మంచి పేరును సూచించవచ్చునని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.