శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (18:00 IST)

ఆస్ట్రేలియాలో హనుమాన్ ఆలయ పూజారి అరెస్టు

హిందూ దేవుళ్ళలో నిష్టతో కూడిన బ్రహ్మచారుల్లో ఆంజనేయస్వామి ఒకరు. అలాంటి ఆలయంలో పూజారిగా ఉండేవారు మరింత నిష్టతో ఉండాలి. కానీ, హనుమాన్ ఆలయంలో పనిచేసే ఓ పూజారి పాడుపనికి పాల్పడి, అత్యాచారం కేసులో బుక్కయ్యాడు. 
 
అత్యాచారాలకు పాల్పడేవారిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పోతోంది. చివరకు బాబాలు, పూజారులు కూడా ఈ తరహా కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా భారత్‌కు చెందిన ఓ స్వామీజీ ఆస్ట్రేలియాలో ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో చిక్కుకున్నాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆనంద్‌గిరికి ఆధ్యాత్మిక గురువుగా పేరుగడించారు. దీంతో అనేక మంది ఎన్నారైలో తమ గృహాల్లో ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు విదేశాలకు తీసుకెళ్లడం జరుగుతుంది. 
 
ఈ కోవలో ఆస్ట్రేలియాలో కొంతమంది భక్తులు ఆయన్ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో, సిడ్నీలో ఇద్దరు మహిళా భక్తులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆనంద్ గిరిని అరెస్టు చేశారు. కోర్టు బెయిలు నిరాకరించడంతో నిందితుడిని సిడ్నీ జైలుకు తరలించారు.