మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (17:45 IST)

విజయశాంతిగారి మాట‌లు మ‌ర్చిపోలేను: హీరో అనురాగ్

Hero Anurag, Radhakrishna
``విజయశాంతి గారు మా సినిమాలోని 'నిర్మల బొమ్మా' సాంగ్  విడుదల చేశారు. ఆమెకు ధ‌న్య‌వాదాలు. విజయశాంతి గారిని చిన్నప్పుడు సినిమాల్లో, టీవీల్లో చూశాను. సాంగ్ రిలీజ్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె చాలా బాగా మాట్లాడారు. విజయశాంతి గారితో మాట్లాడిన మాటలను మర్చిపోలేను. ఎంతో స్పూర్తిదాయ‌కంగా వున్నాయ‌ని`` వ‌ర్ధ‌మాన క‌థానాయ‌కుడు అనురాగ్ తెలియ‌జేస్తున్నాడు.
 
'రాగల 24 గంటల్లో' చిత్రంతో  పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అనురాగ్. ప్రస్తుతం ప్ర‌ముఖ ద‌ర్శకుడు`ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ (పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌ పోషించారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మించారు.  ఇటీవ‌లే రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో అనురాగ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.
 
- లక్ష్మీపార్వతి గారు మా సినిమాలో నటిస్తారని మేం ఊహించలేదు. షూటింగ్ కి రెండు రోజుల ముందు మాకు తెలిసింది ఆమె చేస్తున్నారని. లక్ష్మీపార్వతి గారితో కలిసి  వర్క్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.
 
- ఇండస్ట్రీలో అలీగారు నాకు పరిచయం. ఆయన ద్వారా శ్రీనివాసరెడ్డి గారిని కలిశాం. నా గురించి ఆలీ గారు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు. అప్పట్నుంచి వారితో నాకు మంచి సాన్నిహిత్యం మొదలైంది. వారు చెప్పడం వల్ల 'రాగల 24 గంటల్లో' సినిమాలోని ముగ్గురు హీరోల్లో ఒకరిగా చేశాను. నా యాక్టింగ్ బాగా నచ్చి నన్ను 'రాధాకృష్ణ' మూవీకి రికమండ్ చేశారు.
 
- 'రాగల 24 గంటల్లో' సినిమాలో నా క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. రాధాకృష్ణ లో చేయమనగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఒక పక్క టెన్షన్గా ఉంది. మరోవైపు ఎగ్జైట్మెంట్. రాధాకృష్ణ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
 
- నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిర్మల్ బొమ్మల ప్రసిద్ధి గురించి ఇప్పటి వారికి అంతగా తెలియదు. ఈ సినిమా ద్వారా ఓ మంచి సందేశం నా ద్వారా వెల్లడం చాలా ఆనందంగా ఉంది.
 
- ఈ సినిమా ద్వారా నిర్మల్ బొమ్మలను తయారు చేసే వారి కష్టం తెలిసింది. మన సంస్కృతిని కాపాడుకోవాలి. మాటల్లో చెప్పలేను వారి కష్టాన్ని వారికి ఈ సినిమా ద్వారా పరోక్షం గా హెల్ప్ చేశామని మాకు అనిపిస్తోంది.
 
-  శ్రీలేఖ గారు మంచి సంగీతం అందించారు. చిన్న సినిమా అని ఆమె అనుకోలేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్లో సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. మేం కూడా భావోద్వేగానికి లోనయ్యాం. మా టీమ్ అంతా కష్టపడి మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. చాలా ఆనందంగా ఉంది.
 
- ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ప్రేక్షకులకు నచ్చుతుంది` అన్నారు.