మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (19:12 IST)

ధోనీ సరికొత్త రికార్డ్.. 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కెప్టెన్‌ కూల్‌ మహీ ఐపీఎల్‌ చరిత్రలో 150 మందిని ఔట్‌ చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ నిలిచాడు. ఐపీఎల్‌ 2021లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఫీట్‌ అందుకున్నాడు. 
 
నితీశ్‌ రాణా క్యాచ్‌ అందుకోవడం ద్వారా మైలురాయి చేరుకున్నాడు. లీగ్‌లో ధోనీ ఇప్పటి వరకు 111 క్యాచ్‌లు అందుకోగా.. 39 స్టంపౌట్‌లు చేశాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే ధోనీ క్షణాల్లో స్టంపింగ్‌లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ధోనీ తర్వాత కోల్‌కతా మాజీ కెప్టెన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దినేశ్‌ ఇప్పటి వరకు 112 క్యాచ్‌లు, 31 స్టంపింగ్‌లు చేశాడు.