శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (15:37 IST)

ఐపీఎల్ 2022-కేకేఆర్‌‌పై లక్నో విన్.. పండగ చేసుకున్న గంభీర్ (Video)

Gambhir
Gambhir
ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్‌పై లక్నో విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో కేకేఆర్‌‌పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్‌ కు చేరుకుంది. 
 
తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో వికెట్లు నష్టపోకుండా 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌ కతా 8 వికెట్ల నష్టానికి 208 పరుగుల చేసింది.
 
మొత్తానికి కేకేఆర్‌‌పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో లక్నో ఆటగాళ్ల కంటే ఎక్కువ సెలబ్రేషన్స్‌ చేశారు ఆ జట్టు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌. 
 
మ్యాచ్‌ గెలవగానే.. రెచ్చిపోయి.. చప్పట్లతో.. గంతులేశాడు గౌతమ్‌ గంభీర్‌. తానే మ్యాచ్‌ గెలిపించాననే ఫీలింగ్‌‌లో.. గ్రౌండ్‌ మొత్తం.. పరుగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.