2019 ఐపీఎల్.. ఎన్నికలతో రెండు వారాల ముందే ప్రారంభం.. ట్విట్టర్‌లో షెడ్యూల్

మోహన్| Last Updated: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:25 IST)
2019 ఐపీఎల్ సీజన్ కొంచెం ముందుగా ప్రారంభం కానుంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు వారాల ముందుగా ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎన్నికల దృష్ట్యా కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ని మాత్రమే ప్రకటించింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్చి 24న తన మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మాత్రమే మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్‌లో పొందుపరిచారు.దీనిపై మరింత చదవండి :