రంజాన్ మాసంలో స్వర్గద్వారాలు తెరిచే వుంటాయి..

Selvi| Last Updated: శుక్రవారం, 18 జులై 2014 (19:03 IST)
మొదటి పదిరోజులు దైవకారుణ్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. తర్వాతి పదిరోజుల క్షమాభిక్షకు, చివరి పదిరోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని దైవవూపవక్త అభివర్ణించారు. ఇస్లాంమత విశ్వాసం ప్రకారం స్వర్గానికి గల ఎనిమిది ద్వారాల్లో ఒకటి రయ్యాన్. రంజాన్ నెల ఉపవాసాలు పాటించేవారు ఈ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని విశ్వాసం.

ఈ మాసంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి తమకు మృత్యువు రంజాన్ మాసంలో సంభవించాలని ముస్లింలు కోరుకుంటారు. ఎన్నో అంశాల రీత్యా ఎంతో ప్రాధాన్యత గల రంజాన్ మాసాన్ని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో, పవిత్రమైన భావనలతో ప్రార్థనలతో గడపాలి.

ఈదుల్-ఫితర్‌తో ముగిసే రంజాన్ మాసం ముస్లింలకు అనిర్వచననీయమైన అనుభూతిని, దైవిక ఆధ్యాత్మికతను మిగిలిస్తుంది. రంజాన్ సకల మానవాళికి శుభాలు, శాంతి కలుగజేయాలని కోరుకుందాం..!దీనిపై మరింత చదవండి :