సైతానును రాళ్లతో కొడితేనే హజ్ యాత్ర పరిసమాప్తమవుతుందా? ఎందుకు?

Selvi| Last Updated: శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (13:43 IST)
హజ్ యాత్రలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సైతానును రాళ్లతో కొట్టి తమ యాత్రను ముగించాలనుకున్న తొందర.. 700 మందిని పైగా ప్రాణాలు కోల్పోయేలా చేసింది. హజ్ యాత్ర చేస్తున్న హజీలు ఈద్ అల్ - అధా (పదవ రోజు) నాడు సైతానును రాళ్ల కొడతారు. ఇలా చేస్తేనే హజ్ యాత్ర పరిసమాప్తమవుతుందని నమ్ముతారు.

ఈద్ అల్ - అధా పదవ రోజున ప్రార్థనలు ముగియగానే లక్షలాది మంది ఒక్కసారిగా సైతానును రాళ్లతో కొట్టేందుకు వస్తారు. వారిని నియంత్రించి, వరుస క్రమంలో పంపేందుకు సౌదీ ప్రభుత్వం, లక్షల మంది భద్రతా అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఒక్కోసారి దురదృష్టం వెంటాడుతుంది.

గురువారం హజ్‌లోని మినాలో అదే జరిగింది. సైతానును రాళ్లతో కొట్టి తమ యాత్రను ముగించాలనుకున్నారు. కానీ తొక్కిసలాట ఏర్పడటంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 700 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంతకీ హజ్ యాత్రలో సైతానును రాళ్లతో ఎందుకు కొడతారంటే.. దీని వెనుక ఓ కథ కూడా ఉంది. అబ్రహాంకు కలలో కనిపించిన దేవుడు ''నీ కుమారుడు ఇస్మాయిల్‌ను బలి ఇస్తే.. ముస్లిం సమాజానికి మేలు కలుగుతుందని చెప్తాడు. దీంతో ఇస్మాయిల్‌కు విషయాన్ని చెబితే.. వెంటనే తనను దేవునికి అప్పగించాలని, తక్షణం వధించాల్సిందిగా కోరాడట. ఈ క్రమంలో కన్నబిడ్డను వధించేందుకు అబ్రహాం సిద్ధపడ్డాడట. అయితే అబ్రహాం వధతో తనకు అంతం తప్పదని భావించిన సైతాను, అబ్రహాంను అడ్డుకునేందుకు మూడుసార్లు ప్రయత్నించింది.

సైతాను ప్రత్యక్షమై తన మనసును మార్చాలని ప్రయత్నించిన ప్రతిసారీ అబ్రహాం దాన్ని రాళ్లతో కొట్టి తరిమాడు. ఒక్కోసారి ఏడు రాళ్లు వేస్తూ, సైతానును అక్కడ లేకుండా చూసి తన కొడుకును బలి ఇస్తాడు. ఈ ప్రాంతంలో సైతానుకు ఆనవాళ్లుగా మూడు రాళ్లు మిగిలాయి. అబ్రహం చేసిన త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకునేందుకు ఆ సైతాను రూపంలోని రాళ్లను యాత్రికులు రాళ్లతో కొడతారు.

వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో, మూడు రాళ్లను మూడు పెద్ద పెద్ద గోడల రూపంలోకి మార్చిన సౌదీ ప్రభుత్వం వేల మంది ఒకేసారి రాళ్లను విసిరే ఏర్పాటు చేసింది. హజ్ యాత్ర ముగింపు రోజున ఇలా రాళ్లతో సైతాను కొట్టడం ప్రమాదకరం. భక్తుల సంఖ్య మరింత పెరగడంతో సౌదీ ప్రభుత్వం ఎన్ని అప్రమత్త చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది.దీనిపై మరింత చదవండి :