గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (20:37 IST)

6జీబీ వరకు హై-స్పీడ్ డేటా.. ఎయిర్‌టెల్ ఉచిత కూపన్లు.. రూ. 2,398 ప్లాన్‌ క్యాన్సిల్

భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లతో పాటు ప్లాన్లలో మార్పులు చేస్తోంది. తాజాగా 365 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటాతో అందుబాటులో ఉన్న రూ. 2,398 ప్లాన్‌ను భారతీ ఎయిర్‌టెల్ తొలగించింది. అలాగే రూ.2,498 మాత్రమే అందుబాటులో ఉంది. 365 రోజుల కాలపరిమితి, అపరిమిత వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటా ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. 
 
అదేవిధంగా తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 6 జీబీ వరకు హై-స్పీడ్ డేటా యాక్సెస్‌ను అందించే ఉచిత కూపన్లను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. రూ.2,498 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మే నెలలోనే ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ఇందులో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు 365 రోజుల కాలపరిమితితో లభిస్తాయి.
 
యూజర్ల కూపన్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో జమ అవుతాయి. ఎయిర్‌టెల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే డేటా కూపన్లు జమ అవుతాయని ఎయిర్‌టెల్ తెలిపింది.