నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దు.. యాపిల్
నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. తాజా ప్రకటనలో నిద్రపోతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జ్‌లో ఉంచడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. విద్యుదాఘాతం, మంటలు చెలరేగే అవకాశం ఉన్నందున నిద్రించే సమయంలో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని సూచించారు.
అంతే కాకుండా, మంటతో సహా ప్రమాదాలను నివారించడానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని యాపిల్ సలహా ఇస్తుంది. యాపిల్ నుండి వచ్చిన ఈ హెచ్చరిక ఆండ్రాయిడ్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు కూడా వర్తిస్తుందని గమనించాలి.