గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:15 IST)

సంక్రాంతికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు... కోరియంట్‌తో డీల్

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే యేడాది ఆరంభంలో 5జీ సేవలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఛైర్మన్,

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే యేడాది ఆరంభంలో 5జీ సేవలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. 
 
ఇందుకోసం ఇప్పటికే నోకియా కంపెనీకి చెందిన ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిపారు. ట్రయల్ రన్‌కోసం అవసరమైన చర్యలకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. 5జీ సేవలు అందించడంలో భాగంగా ఇప్పటికే సంస్థ... లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్‌పీతో చర్చలు జరిపింది కూడా. తాజాగా 5జీ టెక్నాలజీ నెట్‌వర్కింగ్ సేవలు అందిస్తున్న కోరియంట్ సంస్థతో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 4జీ సేవలతో పోలిస్తే 5జీ అత్యంత వేగంగా ఉండనున్నదన్నారు. ఈ సేవలను 3జీ, 4జీ నెట్‌వర్క్‌ల కిందనే అందించనున్నట్లు ఆయన తెలిపారు. తమకు దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేరకు ఫైబర్ నెట్‌వర్క్ ఉందని ఆయన వివరించారు.