సోషల్ మీడియాలు ఫోటోలను స్కాన్ చేయాలి.. సీబీఐ

Last Updated: గురువారం, 3 జనవరి 2019 (10:24 IST)
ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఒకందుకు మేలే జరుగుతున్నప్పటికీ.. అసత్యపు వార్తలు పెచ్చరిల్లిపోతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. 
 
దీంతో సోషల్ మీడియా దిగ్గజాలకు సరికొత్త ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఫోటోలను స్కాన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన డీఎన్ఏ సాంకేతికతను ఉపయోగించాలని సీబీఐ కోరింది. పోలీసు విచారణ, దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సొంతమైన ఫోటో డీఎన్ఏ టెక్నాలజీ ఫోటోకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్‌ను సృష్టించింది. ఇంటర్నెట్, ఫ్లాగ్స్ సంబంధిత ఫోటోలను స్కాన్ చేసి వాటికి సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్‌ను క్రియేట్ చేస్తుంది. 
 
ఈ సాంకేతికత ద్వారా చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని సీబీఐ భావిస్తుంది. అయితే సీబీఐ విజ్ఞప్తిని సోషల్ మీడియా యాజమాన్యాలు పట్టించుకుంటాయో లేవో ఇంకా తెలియరాలేదు.దీనిపై మరింత చదవండి :